Amadalavalasa: పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత!

Amadalavalasa: ఆమదాలవలసలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీల.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 3 Oct 2026 10:22 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత!

ఆమదాలవలస: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా బూర్జ మరియు సరుబుజ్జిలి మండలంలో పలువురు పేద కుటుంబాలకు మొత్తం రూ.4 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, పొందూరు మాజీ ఎంపీపీ కూన ప్రమీల బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకుని, ప్రభుత్వం అందించిన సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందే సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ సేవలను బాధిత కుటుంబాలు అభినందించాయి.

సరుబుజ్జిలి మరియు బూర్జ్య మండలాల లబ్ధిదారుల వివరాలు..

నాగళ్ళ మల్లేశ్వరరావు, సరుబుజ్జిలి, 37000, మూడడ్ల రాజారావు, రొట్ట వలస, 23000, ఇప్పిలి చరణ్, రొట్టవలస, 48000, బెవరా దివాకర్ రావు, తమ్మి నాయుడుపేట, 40000, రౌతు సుజాత, నీల దేవిపురం, 23000, కొమరావు వర్మ,పెద్ద లంకం --73000 ,బైల శ్యామలరావు, వావం, 46000,

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA