Amadalavalasa: బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కూన
Amadalavalasa: ఆమదాలవలస నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబ సభ్యులు అందజేశారు.
Amadalavalasa: బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కూన
ఆమదాలవలస: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా పొందూరు మండలంలో పలువురు పేద కుటుంబాలకు మొత్తం రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, పొందూరు మాజీ ఎంపీపీ కూన ప్రమీల బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకుని, ప్రభుత్వం అందించిన సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందే సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ సేవలను బాధిత కుటుంబాలు అభినందించాయి.




