Amadalavalasa: దివంజిపేటలో ఘనంగా శ్రీరామ హృదయం కలశ శోభాయాత్ర

Amadalavalasa: ఆమదాలవలస మండలం దివంజిపేటలో శ్రీరామ హృదయం కలశ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 1 Sept 2026 11:38 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: దివంజిపేటలో ఘనంగా శ్రీరామ హృదయం కలశ శోభాయాత్ర

ఆమదాలవలస: ఆమదాలవలస మండలం దివంజిపేట గ్రామంలో శ్రీరామ హృదయం కలశంతో సోభాయాత్ర(గ్రామ తిరువీధులు ఈరోజు నూతనముగా ప్రతిష్ట చేసినఆంజనేయ స్వామివారి ఆలయమునుండి స్వయంభువుగా వెలసిన శ్రీనరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణము వరకు గ్రామ తిరువీధులు నిర్వహించరి.

మానవీయమైన విలువలు పాటించుటకు ఆదర్శవంతమైన జీవన విధానం అలవడుటకు శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని కుటుంబ గ్రామ ఔన్నత్యము కోరుకుంటూ స్నేహ సౌబ్రాతృత్వ, ఆప్యాయతలు అనురాగాలు అందరితో కలిసి మెలిసి ఉండే విధానాన్ని పెంపొందించుకొనుటకు

ప్రతి గ్రామములో శ్రీరామ హృదయం కలశని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి70 వ తిరునక్షత్రం సందర్భముగా శ్రీకాకుళం వికాస తరంగిణి శాఖ వారి తరఫున కార్యక్రమాలు నిర్వహించబడుతున్నారు. పై కార్యక్రమంలో అంబళ్ల గోవిందరావు అంబళ్ల కోటేశ్వరరావు, జోగి శ్రీనివాసరావు, జొగి మన్మధరావు, జోగి వేంకట రమణ గ్రామ భజన భక్తులుతదితరులు పాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA

Next Story