Palakonda: ఉద్యోగుల సమస్యలపై పాలకొండలో జేఏసీ కీలక భేటీ!
Palakonda: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న శ్రీకాకుళంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరగనుంది.
Palakonda: ఉద్యోగుల సమస్యలపై పాలకొండలో జేఏసీ కీలక భేటీ!
Palakonda: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యపోరాటాలు సాగిస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన జేఏసీ సమావేశం శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు జేఏసీ సంఘ నాయకులు తెలిపారు జేఏసీ సమావేశం పాలకొండలో నిర్వహించారు. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో జరుగుసమావేశాన్ని ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా విజయవంత చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంతి ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ తమ న్యాయమైన డిమాండ్లు సాధన కోసం ఈ సమావేశానికి హాజరుకావాలని జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డివిజన్ రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఎం సావిత్రి, జిల్లా అధ్యక్షుడు జి.శ్రీరామ్ మూర్తి, జేఏసీ డివిజన్ అధ్యక్షుడు భాసూరు కృష్ణమూర్తి ఉద్యోగులుపాల్గొన్నారు.
అమరావతి జేఏసీ పాలకొండ డివిజన్ కార్యవర్గం ఎంపిక, అమరావతి జేఏసీ పాలకొండ డివిజన్ అధ్యక్షుడిగా ఏపీఎస్ఆర్టీసీలో ఏడిసిగా పనిచేస్తున్న భాసూరు కృష్ణమూర్తి అధ్యక్షుడిగా, సహా అధ్యక్షుడిగా కె.చౌదరి నాయుడు, ఎన్.మురళి వేణు, సిహెచ్ రత్నాకర్, అసోసియేట్ అధ్యక్షులుగా కె. సాయిరాములను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బి. బుచ్చయ్య, కార్యదర్శులుగా సత్యనారాయణ, జె కృష్ణ సాయి, వి వెంకటరమణ, బి శివరామకృష్ణ, కోశాధికారిగా పి పృథ్వి సేన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ పి.ఆర్.సి కమిషన్ తక్షణమే నియమించాలని డి ఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యల పరిష్కరించాలని తక్షణమే వారిని క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. విశ్రాంతి ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను వారికి రావలసిన బకాయిలను చెల్లించాలని కోరారు.




