Sompeta: ప్రతి కమతం వారీగా ఈ-పంట నమోదు తప్పనిసరి: ఏవో సురేష్!

Sompeta: సోంపేటలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కొంకేన సురేష్ రైతులు ప్రతి కమతం వారీగా ఈ-పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించారు.

G.RAMBABU, SOMPET
Published on: 2 Sept 2026 9:20 PM IST
Sompeta
X

Sompeta: ప్రతి కమతం వారీగా ఈ-పంట నమోదు తప్పనిసరి: ఏవో సురేష్!

సోంపేట: రైతులందరూ తమ పంటలను ప్రతి కమతం వారీగా ఈ-పంటలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొంకేన సురేష్ కోరారు. బుధవారం మండల రైతు సేవా కేంద్రం పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ-పంట నమోదు ప్రక్రియ సాగుతోందని, ఈ-పంటతో పాటు ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలకు సంబంధించిన వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులకు అందించాలని, ఏపీఏఐఎంఎస్ యాప్ తో రైతులు స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

వరి పంట వేయని కమతంలో తక్కువ నీటితో పండే ఇతర పంటలను వేయాలని, ప్రతి కమతంలో ఏదో ఒక పంట ఉండేటట్టు చూసుకోవాలని కోరారు. ఈ-పంట నమోదు అనంతరం పంట వివరాల ధ్రువీకరణ కోసం రైతులు ఈ-పంట వెబ్ సైట్, ఏపీఏఐఎంఎస్ యాప్ లో తమ పేరుతో నమోదైన పంట వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని, పీఎం కిసాన్ కొరకు ఈ-కేవైసీ మళ్లీ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రదీప్, రైతులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story