Akkupalli: మానవత్వం చాటుకున్న కూటమి ప్రభుత్వం.. ఒకే ఇంటికి రెండు పెన్షన్లు!
Akkupalli: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో కూటమి ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది.
Akkupalli: మానవత్వం చాటుకున్న కూటమి ప్రభుత్వం.. ఒకే ఇంటికి రెండు పెన్షన్లు!
అక్కుపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో మానవత్వాన్ని చాటుకుంది. మండల పరిధిలోని అక్కుపల్లి గ్రామానికి చెందిన ఒకే నిరుపేద కుటుంబానికి రెండు పెన్షన్లను మంజూరు చేసి ఆదర్శంగా నిలిచింది. గ్రామానికి చెందిన కాస కల్యాణేశ్వర రావు అనే నిరుపేదకు గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మంజూరు చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన సతీమణి కాస సుజాత గారు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, సుజాత గారికి కూడా కిడ్నీ బాధితుల ప్రత్యేక పెన్షన్‌ను తక్షణమే మంజూరు చేసింది. నూతనంగా మంజూరైన పెన్షన్ పైకాన్ని వజ్రపుకొత్తూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరాడ మోహనరావు గారు గురువారం లబ్ధిదారుల నివాసానికి స్వయంగా వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందబాష్పాలు రాల్చుతూ.. "మా కష్టాలు చూసి ఒకే ఇంటికి రెండు పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నిరంతరం మాకు అండగా నిలుస్తున్న పలాస శాసనసభ్యులు గౌతు శిరీష మేడం గారికి, స్థానిక నాయకులకు, అధికారులకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం" అని భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు మండల మాజీ ఎంపీపీ ప్రతినిధి, టీడీపీ మండలాధ్యక్షులు సూరాడ మోహనరావుతో పాటు, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సీమ దేవస్వామి, అధికార పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సూరాడ లోకనాధం, గ్రామ సంఘం అధ్యక్షులు మోస వరప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి అర్జాల ఈశ్వరరావు మరియు స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




