Bhamini: భామినిలో ఏనుగుల తీవ్ర విధ్వంసం 100 ఎకరాల్లో పంట నష్టం!

Bhamini: భామిని మండలం నులకజోడులో ఏనుగుల విధ్వంసం. 100 ఎకరాల్లో పంట నష్టం, ఎకరానికి ₹50 వేల పరిహారం చెల్లించి ఏనుగులను తరలించాలని రైతు సంఘం డిమాండ్.

KAILASH SAHU, PALAKONDA
Published on: 15 Sept 2026 1:39 PM IST
Bhamini
X

Bhamini: భామినిలో ఏనుగుల తీవ్ర విధ్వంసం 100 ఎకరాల్లో పంట నష్టం!

Bhamini: భామిని మండలం నులకజోడు గ్రామంలో గత 20 రోజులుగా 4 ఏనుగులు తిష్ట వేసి రైతుల చేతికి అందివచ్చిన మొక్కజొన్న,పత్తి,అరటి,వరి తదితర పంటలను వాటి ఆహారంగా తీసుకోవడం తో పాటు కాళ్లతో పంటలను కుమ్మేయడం వంటి వల్ల గ్రామంలో సుమారు 80 నుంచి 100 ఎకరాల వరకు మొక్కజొన్న,వరి,పత్తి తదితర పంటలుకు నష్టం జరిగిందని స్థానిక గ్రామ రైతులు సంఘం దృష్టి తీసుకురాగా సంఘం మండల గౌరవ అధ్యక్షులు భోగాపురం అప్పలనాయుడు,గురుబిల్లి లక్ష్మీపతి నాయుడు లతో కలిసి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పంటలను పరిశీలించారు.

గతంలో అదే మండలంలో పసుగుడి,ఘనసర తదితర గ్రామాలలో పామాయిల్, ఖర్బజ,అరటి తోటలతో పాటు బోర్ వెల్స్ ను కాళ్లతో తొక్కి తొండముతో పీకి నష్టపెట్టిన ఘటనలో ఉన్నాయి ఆయన ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నష్టాలను గుర్తించడానికి మండల వ్యవసాయ శాఖ, రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను గుర్తించి నష్టపోయిన వాస్తవ రైతులకు ఎకరాపు 50 వేల రూపాయలు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

2009వసంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రం లఖిరేకల్లు అటవీ ప్రాంతం నుంచి 11 ఏనుగులు అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గల వివిధ ప్రాంతాల్లో స్వైర వ్యవహారం చేసి చేతికి అంది వచ్చిన పంటను నాశనం చేస్తూ ఇప్పటివరకు 15 మంది ప్రజలను కూడా పొట్టన పెట్టుకుంటున్న అటవీ శాఖ అధికారులకు ఏమీ పట్టడం లేదని వీరఘట్టం మండలంలో చలివేంద్ర గ్రామంలో వార్త కవరేజ్ చేయటానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి కూడా కాళ్లతో కుమ్మి చంపేశాయనే ఘటనను ఆయనగుర్తు చేశారు. అదే సందర్భంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు కంటిమీద కుడుక లేకుండా చేసేయని ఆ ప్రజల ప్రాణాలు పంటలను నష్టపెడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం 8 ఏనుగులతో మరొక గుంపు కొమరాడ, పార్వతీపురం పరిసరాల ప్రాంతాలలో ప్రజల ప్రాణాలు తీసుకోవడమే కాకుండా పంట నష్టాలకు కారణమైన ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి కుంకి ఎన్నికలు తీసుకొచ్చి మన్యం జిల్లా ప్రజలకు రక్షణ కల్పిస్తామని గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసి కుంకు ఏనుగులు రప్పించినప్పటికీ వాటి ద్వారా ఈ రెండు ఏనుగుల గుంపులను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి పంటలను ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. వాటి వల్ల జరిగిన ప్రాణ పంట నష్టాలకు పరిహారలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.

పంటలునష్టపోయిన రైతులతో పరిశీలన. పుటంశెట్టి ప్రసాద్ రావు కౌలు రైతు,కూర్మాపు చంద్రయ్య,కోట రామారావు, సొంటియాన కృష్ణ,చిన్ని మోహన్ రావు,సొంఠన నారా యణమ్మ,ప్రసాద్, నిద్దాన శ్రీనివాస్,గోరుశెట్ట మోహన్ రావు,అప్పారావు పెంటయ్య, కోట సూర్యారావు,కోట ఆనందరావు,కింగం తేజేశ్వరరావు,కింగం తిరుపతిరావు,గోరుశెట్టి సింహాచలం, గంజి మోహన్ చౌదరి తదితరులు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA