Palakonda: అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి!

Palakonda: అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ పాలకొండలో రైతు, వ్యవసాయ కార్మిక, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

KAILASH SAHU, PALAKONDA
Published on: 22 July 2026 12:51 PM IST
Palakonda
X

Palakonda: అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి!

Palakonda: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు అభ్యుదయ రైతు కండాపు ప్రసాదరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూసి దుర్గారావు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు మండల కార్యదర్శి కాదా రాము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మాట్లాడుతూ అమెరికాతో మన దేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వద్దు అని కోరుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని ఇలాంటి సందర్భంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతుందని.

ఇలాంటి సందర్భంలో ఆ ఒప్పందం జరిగితే అమెరికా నుండి పన్నులు లేకుండా వచ్చే నౌక దిగుమతులు వల్ల మన రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అలాగే ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు మొక్కజొన్న మామిడి పత్తి తదితరి పంటలు ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇలాంటి సందర్భంలో అగ్రిమెంట్లు అమల్లోకి వస్తే ఆహార వాన్ని ఇచ్చే పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు,

ఎనిమిది కోట్ల మంది పాడి రైతులు పూర్తిగా దివాళి తీసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని కోరుతూ గ్రామ గ్రామాన రైతులతో వ్యవసాయ కార్మికులతోనూ సంతకాలు చేయించి రాష్ట్రపతి గారికి పంపించాలని ప్రతి మండలములో నిరసన ప్రదర్శనలు చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రంపు మోడీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఎస్ కె ఎం పిలుపు పిలుపుమేరకు,

ఈ రోజు అనగా బుధవారం పాలకొండ మండల కేంద్రంలో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగాఅన్ని పంటలకు సి20 ప్లస్ 50 మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలి.

అలాగే రైతులు మరియు కౌలు రైతులు మరియు వ్యవసాయ కార్మికుల రుణాలు వెంటనే రద్దు చేయాలి. పేద మరియు మధ్య తరగతి రైతులకు కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులకు పదివేల రూపాయలు పెన్షన్ వెంటనే అందించాలి.

అలాగే నాలుగు లేబర్ కోడ్లను ఉపసహరించాలి

అలాగే రైతులకు అన్ని విధాలు కాదు కావాలని కోరుతూ ఈరోజు ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన రైతులను అడ్డుకోవడం తగదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైన తెలిపిన సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని* "లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకా రైతుల అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.

*ఈ కార్యక్రమంలో సిహెచ్ సురేష్ పామోటి సంగమేశ్ జె శ్రీను బి శివ కే సూర్యరావు ఎం రమణ పి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story