Srikakulam: ఆర్టీసీలో ఐటీఐ పాసైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఐటీఐ అభ్యర్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ అవకాశం. అక్టోబర్ 11 నుండి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 30న సర్టిఫికేట్ వెరిఫికేషన్.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 10 Oct 2026 11:54 AM IST
Srikakulam
X

Srikakulam: ఆర్టీసీలో ఐటీఐ పాసైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు!

Srikakulam: ఆర్టీసీ లో ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు కు అప్ప్రెంటిస్ షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టిసి అధికారి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రాఫ్టమన్ సివిల్, ఐటిఐ పాస్ అయిన అభ్యర్డులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో తేది 11.10.2026 నుండి 26.10.2026 ది లోపు అప్ప్రెంటీస్ షిప్ కోసం, వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి CH. అప్పలనారాయణ ఒక ప్రకటన విడుదల చేసారు.

రిజిస్ట్రేషన్ చేసుకున్న శ్రీకాకుళం జిల్లా అభ్యర్డులు తేదీ 30.10.2026 న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో, ఉదయం 10 గంటలకు, ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, వి. టి. అగ్రహారం. విజయనగరం నందు హాజరు కావలెను. ఇది వరకే సెలెక్ట్ కాబడి, అప్ప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.