Arasavalli: సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి!

Arasavalli: శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Aug 2026 9:37 AM IST
Arasavalli
X

Arasavalli: సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి!  

Arasavalli: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంకు నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ, అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ట్రస్టు బోర్డు కీలక పాత్ర పోషించనుంది.

నూతన ధర్మకర్తల మండలిలో సభ్యులను ప్రభుత్వం నియమించింది. బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆలయ పరిపాలన, అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల్లో నూతన పాలక మండలి నిర్ణయాలు తీసుకోనుంది.

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఏడాదిలో రెండు పర్యాయాలు సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్‌పై ప్రసరించడం ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది.

నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుతో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. త్వరలోనే నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story