Srikakulam: జనసేన నాయకుడు పాత్రుని పాపారావుకు ఘన సన్మానం చేసిన "జనసేన నాయకులు

Srikakulam: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమితులైన పాత్రుని పాపారావును జనసేన నేతలు ఘనంగా సన్మానించారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Updated on: 5 Sept 2026 4:56 PM IST
Srikakulam
X

Srikakulam: జనసేన నాయకుడు పాత్రుని పాపారావుకు ఘన సన్మానం చేసిన "జనసేన నాయకులు 

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గా నియమితులైన ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాత్రుని పాపారావు మాస్టర్ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన శుభసందర్భంగా ఆయనను జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మల్లేశ్వరరావు(కేఎంఆర్ ) జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, పైడి మురళీమోహన్ (సరుబుజ్జిలి మండల అధ్యక్షులు), మురపాక రాజశేఖర్ (శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు), కాకర్ల బాబాజీ ఎచ్చెర్ల యువ నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అరసవలి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో అతనికి శుభాభినందనలు తెలియజేసి, సన్మానం చేయడం జరిగింది.

జనసేన పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కోరుకొండ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈ పవిత్రమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ స్వామివారి సేవలో మరింతగా భాగస్వాములు కావాలని మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని ఆకాంక్షిస్తూ.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA