Santhabommali: రైల్వే జోన్‌ను వైసీపీ అడ్డుకుంది

Santhabommali: ఐదేళ్లలో రూ.10.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచారని, రైల్వే జోన్‌కు కనీసం 54 ఎకరాల భూమి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

RAMBABU, TEKKALI
Published on: 1 Jun 2026 3:37 PM IST
Santhabommali
X

Santhabommali: రైల్వే జోన్‌ను వైసీపీ అడ్డుకుంది

సంతబొమ్మాళి: గొడ్డలిపోటు రాజకీయాలు చేసే వైసీపీ.. భవిష్యత్తులో పూర్తిగా సమాధి కావడం ఖాయం తోటాడ పింఛను కార్యక్రమం సందర్భంగా వైసీపీ పార్టీ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, ఆచరణ సాధ్యం కాని హామీల తోజగన్ ప్రజలను మోసం చేశాడు అంటూ మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్‌కు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కాలయాపన చేసింది కానీ కనీసం 54 ఎకరాల భూమిని కూడా కేటాయించలేకపోయింది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, ఇప్పుడు వైసిపి అధికారం సొంతం చేసుకోవడానికి కులాల మధ్య ,మతాల మధ్య చిచ్చు రేపుతూ నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల నరికించి డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు, ఎన్ని డ్రామాలాడిన వైసీపీ కుట్రలను అన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో వైసిపి ప్రభుత్వం ఆడుకుందంటూ విమర్శించారు, సొంత టీవీ, పేపర్ మాధ్యమాల ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తూ వైసిపి & కో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు వ్యాఖ్యానించారు, గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ.10.5 లక్షల కోట్లు అప్పులు తప్ప కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా చేసిందా అంటూ ప్రశ్నించారు.

2014-19 ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధిపై...2019-24 వైకాపా కాలంలో చేసిన అభివృద్ధి గురించి చర్చకు రావాలని సవాల్ విసిరారు, ప్రతినెల బటన్ నొక్కానని కథలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపేరు తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేయలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నింటిని సరిదిద్దుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 నెలల్లో 65 లక్షల మంది ప్రజలకు పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కొనియాడారు, 24 నెలల్లో 65 వేల కోట్లరూపాయలు పింఛన్లు రూపేనా పేదలకు అందజేశాం అంటూ తెలిపారు.

2029 నాటికి ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ ద్వారా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అంటూ కొనియాడారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI

Next Story