Rajam: రాజీపేట జంక్షన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి!
Rajam: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని రాజీపేట జంక్షన్ సమీపంలో తోటపల్లి కాలువ వద్ద ఆటో డ్రైవర్ కోడూరు రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Rajam: రాజీపేట జంక్షన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధిలోని రాజీపేట జంక్షన్ సమీపంలోని తోటపల్లి కాలువ గట్టు వద్ద ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతుడు గారా చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (ఆటో డ్రైవర్)గా గుర్తించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




