Rajarampuram: రాజారాంపురంలో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన అర్చన!
Rajarampuram: పొలాకి మండలం రాజారాంపురంలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన టీడీపీ నేత బగ్గు అర్చన. విద్యార్థులు, మహిళల ప్రయాణ కష్టాలకు తెర.
Rajarampuram: రాజారాంపురంలో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన అర్చన!
Rajarampuram: పొలాకి మండలం రాజారాంపురం గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన బస్సు సర్వీసును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి బగ్గు అర్చన గారు జెండా ఊపి ప్రారంభించారు.
రాజారాంపురం గ్రామం నుండి నరసన్నపేటకు, శ్రీకాకుళంకు వెళ్లే విద్యార్థులు, మహిళలు, రైతులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే. బగ్గు రమణమూర్తి గారు మరియు అర్చన గారు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు మరియు అర్చన గారు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసు మంజూరు చేయించారు.
ఈరోజు గ్రామంలో బస్సును ప్రారంభించి, గ్రామస్తులతో కలిసి కొద్దిదూరం ప్రయాణించారు. "రాజారాంపురం గ్రామస్తుల సమస్య నా దృష్టికి రాగానే వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సు సర్వీసును మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యంగా మన ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం వల్ల ఈ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు కూడా సమయానికి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు వీలవుతుంది. మీ సమస్యల పరిష్కారానికి నేను, మన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం" అని తెలిపారు.
పోలాకి మండలం రాజారాంపురం గ్రామస్తుల చిరకాల కోరిక అయిన బస్సు సర్వీసును ఈరోజు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పడుతున్న ఇబ్బందిని గమనించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ సర్వీసు మంజూరు చేయించడం జరిగింది. గ్రామ ప్రజల ఆనందం చూస్తుంటే చాలా సంతోసంగ ఉంది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న పిఏసిఎస్ చైర్మన్ బైరి.భాస్కరరావు గారు,కిల్లి. వేణుగోపాల్ గారు,సూరపు.నారాయణదాసు గారు,డోల. ప్రసాద్ గారు వెంకునాయుడు,మైలపిల్లి.త్రినాథ్ గారు,బోర.వెంకట్రావుగారు, గౌరీనాయుడుగారు,రామకృష్ణ గారు, అర్జల. విష్ణు,ఎర్రయ్య గారు,మురళి, సాయి, అమ్మినాయుడు గారు, మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.




