Narasannapeta: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Narasannapeta: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి 50 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేశారు.
Narasannapeta: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Narasannapeta: తుఫాను తీవ్రత కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక, జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
పోలాకి మండలం - గుప్పిడిపేట గ్రామంలో తుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు స్వయంగా 50 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణం మరియు సముద్రంలో వేట నిషేధ హెచ్చరికల వల్ల మత్స్యకారులు తీరానికే పరిమితమై, రోజువారీ జీవనోపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించిందని తెలిపారు.
మత్స్యకార కుటుంబాలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా 50 కేజీల నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర అత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




