Pathapatnam: PLI బకాయిలు చెల్లించాలని పాతపట్నంలో ఉద్యోగుల ఆందోళన!
Pathapatnam: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు పాతపట్నంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఐదు రోజుల పని దినాలు, PLI చెల్లింపులపై తీవ్ర నిరసన.
Pathapatnam: PLI బకాయిలు చెల్లించాలని పాతపట్నంలో ఉద్యోగుల ఆందోళన!
Pathapatnam: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు పాతపట్నంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె, నిరసన చేసి తెలిపారు.
స్థానిక పాతపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరియు కెనరా బ్యాంక్ మరియు పాతపట్నం లో గల అన్ని బ్యాంకులు వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వద్ద శుక్రవారం పలు బ్యాంకుల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాతపట్నంతో పాటు గంగువాడ, చాపర, నివగాం స్టేట్ బ్యాంక్ శాఖల ఉద్యోగులు, అలాగే పాతపట్నం, కొరసవాడ, సీధి, చాపర, తెంబూరు ప్రాంతాలకు చెందిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGVB) సిబ్బంది భాగస్వామ్యమయ్యారు.
వీరితో పాటు పాతపట్నం కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మరియు ఇండియా ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
ఐదు రోజుల పని దినాలు: 2024లోనే ఐదు రోజుల పని దినాల (5-Day Work Week) విధానాన్ని అమలు చేస్తామని యాజమాన్యం, ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
PLI లబ్ధి: ఉద్యోగులకు అందాల్సిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా UFBU ప్రతినిధులు మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న పనిభారానికి తగినట్లుగా ఐదు రోజుల పని దినాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయి, ఖాతాదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు.




