Pathapatnam: కూటమి విజయం కోసం సమన్వయంతో పనిచేయాలి!
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం జడ్పీటీసీ కూటమి బీజేపీ అభ్యర్థి సిరిపురం త్రివేణికి జిల్లా ఇన్‌చార్జ్ SVS ప్రకాష్ రెడ్డి ఫామ్-బి అందజేశారు.
Pathapatnam: కూటమి విజయం కోసం సమన్వయంతో పనిచేయాలి!
Pathapatnam: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండల ZPTC కూటమి బీజేపీ అభ్యర్థి శ్రీమతి సిరిపురం త్రివేణికి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ ఇంచార్జ్ శ్రీ SVS ప్రకాష్ రెడ్డి ఫామ్-బి అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థి సిరిపురం త్రివేణికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీ శ్రేణుల సమష్టి కృషితో ప్రజల మద్దతు కూడగట్టుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో నిర్వహించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకతోట సింహాచలం, బీజేపీ సీనియర్ నాయకులు అట్టాడ రవిబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పేడాడ సూరపునాయుడు పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.




