Rajam: రాజాం 8, 16వ వార్డు బీజేపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!
Rajam: రాజాం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు అభ్యర్థి దాసరి అనసూయ, 16వ వార్డు అభ్యర్థి కోటగిరి మాధురికి బీజేపీ నాయకులు బీ-ఫారాలు అందజేశారు.
Rajam: రాజాం 8, 16వ వార్డు బీజేపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!
Rajam: రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేసింది. రాజాం 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా దాసరి అనసూయ, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కోటగిరి మాధురికి పార్టీ అధిష్టానం బీ-ఫారాలను అందజేసింది.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
మున్సిపాలిటీలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి నారాయణరావు, దాసరి అమర్, శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




