Bobbili: ఆధార్-కరెంట్ మీటర్ల లింక్‌తో 'తల్లికి వందనం' కట్
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆధార్‌కు 4 కరెంట్ మీటర్లు లింకై 'తల్లికి వందనం' ఆగిన మహిళ సమస్యపై విద్యుత్ AE సాంబశివరావు స్పందించి పరిష్కరించారు.
Bobbili: ఆధార్-కరెంట్ మీటర్ల లింక్‌తో 'తల్లికి వందనం' కట్
విజయనగరం జిల్లా...
పట్టణానికి చెందిన బొద్దాన గౌరీ కొన్ని రోజుల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో బట్టల షాపులో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన విద్యార్థుల తల్లికి వందనం 13, వేల రూపాయలు గౌరీ అకౌంట్లో పడలేదని సచివాలయం కి వెళ్లి అడగగా నీ ఆధార్ నెంబర్ తో 4,కరెంట్ మీటర్లు ఉన్నాయని సచివాలయం సిబ్బంది చెప్పడం జరిగింది.కొంగు తిన్న మహిళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ AE సాంబశివరావును కలిసి సమస్యను తెలియజేసింది.AE సాంబశివరావు సిబ్బంది ద్వారా వివరాలు సేకరించి ఆమె ఆధార్ నెంబర్ తో 4 మీటర్లు ఉండడం నిజమని, ఒకటి తన పేరు మీద ఉందని, మిగతా 3 మీటర్లు కూడా బొబ్బిలి పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ఉన్నాయని, వాళ్ల ఫోన్ నెంబర్లు సేకరించామని వారికి ఇంటిమేషన్ చేసి వాళ్ల ఆధార్ కార్డులు తీసుకొని ఆ 3 మీటర్లను వారి ఆధార్ నెంబర్ పై యాడ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని తరువాత సచివాలయం కి ఆమె వెళ్లి చెబితే తల్లికి వందనం రెండో విడతలో పడుతుందని AE సాంబశివరావు తెలియజేశారు. మీడియా ప్రతినిధులు వెళ్లి అడుగగా కరెంట్ మీటర్ల సమస్య ఇలా ఇప్పటికీ ఈ సంవత్సరం12,మంది కి వచ్చిందని వారందరికి కూడా పరిష్కారం చేశామని ఆయన అన్నారు.




