Bobbili: బొబ్బిలి చైర్పర్సన్కు అచ్యుతవల్లి, రేణుక నామినేషన్!
Bobbili: విజయనగరం బొబ్బిలి చైర్పర్సన్ స్థానానికి వైసీపీ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి, కూటమి అభ్యర్థి రేణుకా దేవి నామినేషన్ వేశారు. కూటమి భారీ ర్యాలీ చేపట్టింది.
Bobbili: బొబ్బిలి చైర్పర్సన్కు అచ్యుతవల్లి, రేణుక నామినేషన్!
Bobbili: బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో - ప్రధాన ఘట్టం ప్రారంభమైంది! బొబ్బిలి మున్సిపల్ చైర్ పర్సన్ పీఠానికి ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ల ఘట్టంతో బొబ్బిలిలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.
ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిలి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా శ్రీమతి తూముల అచ్యుతవల్లి తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మున్సిపల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున బొబ్బిలి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా శ్రీమతి రాంబార్కి రేణుకా దేవి స్వప్న తన నామినేషన్ దాఖలు చేశారు.
బొబ్బిలి కోట నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆమె బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన గారు బుడా చైర్మన్ శ్రీ తెంటు రాజా గారు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గిరడ అప్పలస్వామి గారితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన బుడా చైర్మన్ తెంటు రాజా - జనసేన ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
బొబ్బిలి మున్సిపల్ చైర్ పర్సన్ పీఠానికి ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో బొబ్బిలి పురపాలక ఎన్నికల్లో పోటా పోటీ రసవత్తరంగా మారింది.




