Parvathipuram:సీఎం చంద్రబాబు రైతు పక్షపాతి: ఎమ్మెల్యే బోనెల!
Parvathipuram: కూటమి ప్రభుత్వ అజెండా రైతు సంక్షేమమే: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.
Parvathipuram:సీఎం చంద్రబాబు రైతు పక్షపాతి: ఎమ్మెల్యే బోనెల!
పార్వతీపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని ఆయన కొనియాడారు.సోమవారం సీతానగరం మండలం ఆర్.వెంకంపేట గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
రైతులతో కలిసి నారుమడిలో వరి విత్తనాలు చల్లి, సాంప్రదాయ అరక పట్టి దుక్కు దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాల పంపిణీ చేపట్టామని తెలిపారు.
సాగు కాలంలో ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




