Kanchili: కంచిలి శ్మశాన వాటికలో బోరు నిర్మాణ పనులకు భూమిపూజ

Kanchili: చిన్న కొజ్జిరియా శ్మశాన వాటికలో తాగునీటి బోరు పనులకు భూమిపూజ చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు.

G.RAMBABU, SOMPET
Published on: 10 July 2026 8:11 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి శ్మశాన వాటికలో బోరు నిర్మాణ పనులకు భూమిపూజ

కంచిలి: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామ శ్మశాన వాటికలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన బోరు నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ బోరును మంజూరు చేయించామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డ హరిబాబు, రమేష్, చిన్న బాబు, ఆనంద్, ధర్మారావు ముద్దపు రవణ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story