Sompeta: కంచిలిలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏర్పాటు!
Sompeta: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏర్పాటు. చైర్మన్‌గా బుడ్డెపు కామేష్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా సహుకారి సోమేశ్వరరావు నియామకం.
Sompeta: కంచిలిలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏర్పాటు!
Sompeta: కంచిలి వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కంచిలి మండలానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా ఉపాధ్యాయుడు బుడ్డెపు కామేష్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ హెడ్‌మాస్టర్ సహుకారి సోమేశ్వరరావును నియమించారు.
కన్వీనర్‌గా శారీరక విద్యా ఉపాధ్యాయురాలు రోజారమణి మహాపాత్రో, ప్రధాన కార్యదర్శిగా సామాజిక కార్యకర్త డాక్టర్ జయప్రకాష్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా శ్రీ సాయి ట్రస్ట్ వ్యవస్థాపకుడు బెందాళం రమణస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి, సీనియర్ అసిస్టెంట్ బుద్దాల జయకృష్ణ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు మరో పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ విష్ణుమూర్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఉత్సవ కమిటీకి పూజా సామగ్రిని అందజేశారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలను భక్తులకు ఇబ్బందులు లేకుండా, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టనున్నారు.




