Kanchili: టాపర్లకు ఘన సన్మానం.. బూరగాం గ్రామానికి విద్యార్థుల కీర్తి
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం పంచాయతీకి చెందిన విద్యార్థులు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
Kanchili: టాపర్లకు ఘన సన్మానం.. బూరగాం గ్రామానికి విద్యార్థుల కీర్తి
Kanchili: కంచిలి మండలం బూరగాం పంచాయతీకి చెందిన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి కీర్తి తెచ్చారు. ఈ సందర్భంగా గ్రామ, మండల ప్రజాప్రతినిధులు ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.
పదో తరగతిలో బూరగాం ప్రభుత్వ పాఠశాలకు చెందిన సింహాద్రి హాసిని 600లో 589 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సోంపేట రవీంద్రభారతి పాఠశాల విద్యార్థిని బద్రి సౌజన్య 587 మార్కులు సాధించగా, శారధ విద్యానికేతన్‌కు చెందిన బొట్టా శ్రీకర్ 587 మార్కులతో ప్రతిభ చాటాడు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బద్రి మధులత 574 మార్కులు సాధించగా, సోంపేట సంస్కారభారతి కాలేజీకి చెందిన బొడ్డు శ్రీవిద్య 470లో 461 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.
ఈ సందర్భంగా ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ దుర్గాసి ధర్మారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి కొనపల సురేష్, మండల వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకటరావు, యువజన అధ్యక్షుడు మడ్డు అభి యాదవ్, మద్దిల భీమరావు, మడ్డు వెంకటేశ్వరావు, బొట్టా చిన్నారావు, బుడ్డ షణ్ముఖరావు, మడ్డు జగన్మోహన్ రావు, మాస్టీల మన్మధరావు, పిల్లల లింగరాజు, మడ్డు వెంకటేష్, మడ్డు సాయికుమార్, గుర్రు వల్లభరావు, గుర్రు ఈశ్వరరావు, బొట్టా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.




