Kaviti: వినాయక మండపానికి రూ.10 వేల విరాళం: వ్యాపారవేత్త కృష్ణారావు దాతృత్వం
Kaviti: కవిటి మండలం మాణిక్యపురంలో సిద్ధి వినాయక యువజన సంఘం మండప నిర్మాణానికి స్థానిక వ్యాపారవేత్త మొగల్పూర్ కృష్ణారావు రూ.10 వేల సాయం అందించారు.
Kaviti: వినాయక మండపానికి రూ.10 వేల విరాళం: వ్యాపారవేత్త కృష్ణారావు దాతృత్వం
Kaviti: కవిటి మండలం మాణిక్యపురం గ్రామం కార్జివీధిలో సిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల నిర్వహణకు మండప నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండప నిర్మాణానికి కవిటి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త మొగల్పూర్ కృష్ణారావు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యువజన సంఘం చేస్తున్న కార్యక్రమాలకు తనవంతు సహకారంగా ఈ ఆర్థిక సహాయం అందించినట్లు కృష్ణారావు తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన కృష్ణారావుకు సిద్ధి వినాయక యువజన సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హరికృష్ణ సాహు, సందీప్ మజ్జి, సునీల్ సాహు, పంచానన బిసాయి తదితరులు పాల్గొన్నారు.
Next Story




