Amadalavalasa: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి!

Amadalavalasa: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్ సవాల్.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 12 Sept 2026 9:24 AM IST
Amadalavalasa
X

Amadalavalasa: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి!

Amadalavalasa: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ ఆరోపించారు. డీఎస్సీకి సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

టెట్, డీఎస్సీ పరీక్షలు రాయకుండా, అర్హతలు లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. జీవో 47, అనంతరం తీసుకొచ్చిన జీవో 56తో పాటు స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఫేక్‌ సర్టిఫికెట్లు, బోగస్‌ టోర్నమెంట్ల పేరుతో ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.డీఎస్సీ అక్రమాలపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చర్చకు రావాలని చింతాడ రవికుమార్ సవాల్‌ చేశారు.

తాము లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, తేదీ, సమయం, స్థలం ఖరారు చేస్తే బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. సాఫ్ట్‌బాల్‌ స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్ల వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగుల భవిష్యత్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుంచాలని చింతాడ రవికుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, వివిధవాదాల్లో ఉన్ననాయకులుపాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA