Kanchili: కంచిలిలో తహసిల్దార్ రమేష్ ఆధ్వర్యంలో సెన్సెస్ శిక్షణ తరగతులు

Kanchili: కంచిలి తహసిల్దార్ రమేష్ ఆధ్వర్యంలో సెన్సెస్ శిక్షణ తరగతులు. ఫారాల భర్తీ, డేటా సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించి ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Aug 2026 6:59 AM IST
Kanchili
X

Kanchili: కంచిలిలో తహసిల్దార్ రమేష్ ఆధ్వర్యంలో సెన్సెస్ శిక్షణ తరగతులు

Kanchili: కంచిలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సెన్సెస్ కార్యక్రమంపై శిక్షణ తరగతి నిర్వహించారు. కంచిలి తహసిల్దార్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెన్సెస్ సిబ్బందికి విధి విధానాలు, ఫారాల నింపుదల, డేటా సేకరణ పద్ధతులు, రికార్డుల నిర్వహణపై వివరంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, సెన్సెస్ అనేది దేశ అభివృద్ధికి కీలకమైనదని, ప్రతి ఇంటి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పూర్తి నిజాయితీతో, ఖచ్చితంగా సేకరించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు.

కార్యక్రమంలో సెన్సెస్ సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story