Srikakulam: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలి సిఐటియు!

Srikakulam: ఓటు చోరీకి పాల్పడుతున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుండి తొలగించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సిఐటియు, రైతు సంఘాల నిరసన. పత్రాల దగ్ధం.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 10 Oct 2026 11:44 AM IST
Srikakulam
X

Srikakulam: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలి సిఐటియు!

Srikakulam: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవ నుండి వెంటనే తొలగించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, రైతు సంఘం నాయకులు టి.నందోడు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఓటు చోరీకి పాల్పడుతున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుండి వెంటనే తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండల కేంద్రంతో పాటు చిలకపాలెం గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్ ఫోటోలతో కూడిన పత్రాలను దగ్ధం చేశారు.

కోట్లాది మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడంతో సహా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రవర్తన, ఎన్నికలు కమిషన్‌పై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగే హక్కును కోల్పోయారు కాబట్టి ఈసీఐ విశ్వసనీయతను పునరుద్ధరించడానికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారందరి ఓటు హక్కులను పునరుద్ధరించాలని ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని రక్షించంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం నాయకులు వై.గోపాలుడు, డి.బంగార్రాజు, పి.రామారావు, పుట్టగణపతి, పి.సత్యం, టి.సూరిబాబు, టి.అసిరవాడు,కె.బుడ్డోడు,ఆర్. వెంకన్న,బి. వాసు,పి.అసిరయ్య, పి.సరసమ్మ,బి.మహాలక్ష్మమ్మ,ఏ.మహాలక్ష్మి,పి.రాజులమ్మ, బి.రాములమ్మ, శ్రీనివాసరావు,ధర్మారావు,త్రినాధ్, కెవి.రమణ, డి.శ్రీను,రమణ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.