Kanchili: లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ రమణ!

Kanchili: కంచిలి మండలంలో పంచాయతీ అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జి.వి. రమణ హెచ్చరించారు.

G.RAMBABU, SOMPET
Published on: 22 Nov 2026 9:30 PM IST
Kanchili
X

Kanchili: లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ రమణ!

కంచిలి: కంచిలి మండలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమించే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని డీఎస్పీ జి.వి. రమణ హెచ్చరించారు. ఆదివారం కంచిలి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆదివారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ జి.వి. రమణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా శాంతియుత వాతావరణంలో ప్రచారం నిర్వహించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని సూచించారు. అల్లర్లకు ప్రోత్సహించినా, అల్లర్లకు పాల్పడినా సంబంధిత వ్యక్తులు, వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల అనంతరం గెలుపోటములు సహజమని, తెలిపారు. విజయోత్సవాల పేరుతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజే కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఎన్నికల్లో ఏజెంట్ల పాత్ర కీలకమని, వారు ఎలాంటి గొడవలకు దిగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని సూచించారు.

అభ్యర్థులు నేరచరిత్ర కలిగిన వారిని, అల్లర్లకు ప్రోత్సహించే వ్యక్తులను ఏజెంట్లుగా నియమించరాదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.మంగరాజు ఎస్సై పి పారినాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET