Rajam: సారథి-వంజరంపేటలో వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ!
Rajam: రాజాం పరిధిలోని సారథి-వంజరంపేటలో వినాయక నిమజ్జనం వేళ ఇరువర్గాల మధ్య ఘర్షణ. సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు.
Rajam: సారథి-వంజరంపేటలో వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని సారథి–వంజరంపేట గ్రామంలో గత ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
సమాచారం అందుకున్న వెంటనే రాజాం సీఐ నవీన్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల పర్యవేక్షణలో అదుపులో ఉన్నట్లు సమాచారం.




