ఉత్తరాంధ్రకు సాగునీటి కళ: రూ. 2 వేల కోట్లతో 11 ప్రాజెక్టులు.. తోటపల్లి ఆధునీకరణపై రైతుల ఆశలు!
ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను రూ. 2 వేల కోట్లతో పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిపై అభ్యుదయ రైతు ప్రసాదరావు హర్షం వ్యక్తం చేస్తూనే, తోటపల్లి ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని కోరారు.
ఉత్తరాంధ్రకు సాగునీటి కళ: రూ. 2 వేల కోట్లతో 11 ప్రాజెక్టులు.. తోటపల్లి ఆధునీకరణపై రైతుల ఆశలు!
విజయనగరం/ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్రాలో 2 వేల కోట్లతో కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అభ్యుదయ రైతు, వాటర్ రిసోర్సర్ ఖండాపు ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో రెండువేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలపడం సాగు బూమికి నీరందని పొలాలకు సాగునీరంది రైతులు ఆదాయం పెంచుతొందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్ట ద్వారా 2.49 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.
తక్కువ డబ్బుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకువస్తామనడం శుభపరిమాణం. గత 12 సంవత్సరాలుగా తోటపల్లి ఆధునీకరణ చేపట్టకపోవడంతో దిగువనున్న 8 బ్రాంచీలకు సంబంధించి 54 వేల ఎకరాలకు సాగునీరందక రైతులు నష్టపోతుందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తోటపల్లి ప్రాజెక్టు వద్ద సమావేశం ఏర్పరచితాము అధికారంలోకి వస్తే తోటపల్లి ఎడమ కాలువ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టి తోటపల్లి ఆ ఎడమ కాలువ కింద రైతులను ఆదుకోవవాలన్నారు. చంద్రబాబునాయుడు గారు అప్పట్లో 180 కోట్లు తోటపల్లి ఆధునీకరణకు కేటాయించారు. తదుపరి వైఎస్సార్ హయాంలో జగన్ గారు 45 కోట్ల ఖర్చు పెట్టారు. అందువల్ల 25 శాతం లోపు పని శాతంతో దాన్ని నిలిపివేశారు. డిట్రిబ్యూటరీలకు తెలుపులు లేక ప్రధాన ఎడమ కాలువ ఆధునీకరణ లేక రైతుల నష్టపోతున్నారు. నేడు అది 500 కోట్లకు చేరింది. చంద్రబాబునాయుడు తన మాటను నిలబెట్టకొని ఉత్తరాంధ్రకు కేటాయించిన 2 వేల కోట్లు నిధులలో తోటపల్లి ఆదునీకరణ చేపట్టి రైతులను ఆదుకోవాలని ప్రసాదరావు కోరుతున్నారు.




