Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీకి రూ.19 కోట్లు: సీఎం సమీక్ష

Ichchapuram: ఇచ్చాపురం పురపాలక సంఘానికి మంజూరైన రూ.19 కోట్ల అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 22 Sept 2026 9:39 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీకి రూ.19 కోట్లు: సీఎం సమీక్ష

ఇచ్చాపురం: పట్టణ మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులతో పాటు, ఇచ్చాపురం పురపాలక సంఘానికి మంజూరైన రూ.19.00 కోట్ల నిధుల వినియోగం, ప్రాధాన్యతా పనులపై ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో పురపాలక కమిషనర్ ఎన్. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.19 కోట్ల నిధులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సద్వినియోగం చేస్తామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పి. తవిటయ్య, పార్టీ కార్యదర్శి ఎన్. కోటి, 22వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కె. దిలీప్‌లతో పాటు మున్సిపల్ విభాగాధికారులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా (MEPMA) ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram