Srikakulam: ఆపదలో ఆదుకున్న ప్రభుత్వం.. కంచిలిలో గంగయ్యకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
Srikakulam: కంచిలి మండలం రాగుపురంలో బతకల గంగయ్యకు రూ. 35,101 సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ.
Srikakulam: ఆపదలో ఆదుకున్న ప్రభుత్వం.. కంచిలిలో గంగయ్యకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
Srikakulam: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ సహకారంతో కంచిలి మండలం ఎంఎస్‌పల్లి పంచాయతీ రాగుపురం గ్రామానికి చెందిన బతకల గంగయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 35,101 ఆర్థికసాయం అందించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన గంగయ్య ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ సాయం మంజూరు చేసిందని తెలుగుదేశం పార్టీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు తెలిపారు. అనంతరం చెక్కును బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, రాగుపురం గ్రామంలో రాజకీయాలు, పార్టీలకు అతీతంగా సమస్యలతో బాధపడుతున్న, అవసరమైన వారికి ప్రభుత్వ పథకాలు, ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు, ఇంటింటికీ కుళాయి పనులు పూర్తి చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో గ్రామానికి ఎటువంటి అవసరాలు ఉన్నా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కిషోర్ కుమార్ పాడి, బుడ్డెపు శ్రీరాములు రెడ్డి, కొత్తకోట శ్రీకాంత్, పైల రామారావు, సోమేశ్, తిరుమలరావు, ప్రసాద్, ధర్మ, మద్దిల భాస్కర్, రాగుపురం గ్రామానికి చెందిన లోహిదాస్ రెడ్డి, హరికృష్ణ, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.




