Parvathipuram: అసాధారణ ప్రతిభ ఉన్న చిన్నారులకు కేంద్ర అవార్డులు..
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ – 2027'
Parvathipuram: అసాధారణ ప్రతిభ ఉన్న చిన్నారులకు కేంద్ర అవార్డులు..
పార్వతీపురం: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP)–2027 కోసం అర్హత గల చిన్నారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు, నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన బాలబాలికలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆవిష్కరణలు, సామాజిక సేవ, విద్య, క్రీడలు, కళలు–సంస్కృతి, ధైర్యసాహసాలు తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారులు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు.2026 జూలై 31 నాటికి కనీసం 5 సంవత్సరాలు పూర్తి చేసి, 18 సంవత్సరాలు మించని భారతీయ పిల్లలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
బాలుడు లేదా బాలిక స్వయంగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు, వ్యక్తులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు కూడా అర్హులైన చిన్నారులను నామినేట్ చేయవచ్చన్నారు.దరఖాస్తులు, నామినేషన్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని, https://awards.gov.in పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 31, 2026 అని తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు




