Srikakulam: క్యూఆర్ కోడ్ ద్వారా అర్జీల ఫీడ్‌బ్యాక్: కలెక్టర్ స్వప్నిల్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 163 అర్జీలు స్వీకరించారు.
Srikakulam: క్యూఆర్ కోడ్ ద్వారా అర్జీల ఫీడ్‌బ్యాక్: కలెక్టర్ స్వప్నిల్!
శ్రీకాకుళం: క్యూ అర్ కోడ్ ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ నెంబర్ కు ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు గ్రీవెన్స్ అర్జీ దారులను ప్రోత్సహించాలన్నారు.
అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
163 ఆన్ లైన్ అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ 63, పంచాయతీ రాజ్ 14, పట్టణ మరియు పరిపాలన శాఖ 12, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 11, గృహ నిర్మాణ శాఖ 7, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, స్కిల్ డెవలప్మెంట్ 5, హోంశాఖ 5, వాటర్ రిసోర్స్ ఈఎన్సి 4, ఏపీ ఈపీడీసీఎల్ 4, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డ్ 4, గ్రామీణ నీటి సరఫరా 3, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2, గ్రామీణాభివృద్ధి 2, విద్యాశాఖ 2, ఏపీఎస్ఆర్టీసీ 2, సమగ్ర శిక్ష 2, హార్టికల్చర్, దేవాదాయ శాఖ.
కుటుంబ సంక్షేమం, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ, మహిళ స్త్రీ శ్రీ సంక్షేమం, తదితర శాఖలకు సంబంధించి ఒక ఒకటి చెప్పినా అర్జీలు స్వీకరించారు తదితర శాఖలకు సంబంధించి ఒక ఒకటి చెప్పు అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డిప్యూటీ కలెక్టర్ జి. జయదేవి, ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, డిఆర్డీఎ పిడి కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




