Srikakulam: శ్రీకాకుళంలో కోడి రామమూర్తి క్రీడా మైదాన పనులు పరిశీలన!
Srikakulam: శ్రీకాకుళం శ్రీ కోడి రామమూర్తి క్రీడా మైదానంలో అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్.
Srikakulam: శ్రీకాకుళంలో కోడి రామమూర్తి క్రీడా మైదాన పనులు పరిశీలన!
Srikakulam: శ్రీ కోడి రామమూర్తి క్రీడా మైదానంలో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. శ్రీ కోడి రామూర్తి క్రీడా మైదానం పనులను స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్, ఆర్ అండ్ బి అధికారులతో కలసి ఆయన గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదానంలో గ్యాలరీ ఏర్పాటు, పార్కింగ్, వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటుకు మైదానం అంతటా శాసన సభ్యులతో కలసి పర్యటించి ఆయా స్థలాలను పరిశీలించారు. గ్యాలరీ ఏర్పాటు చేస్తే వాహనాలు రాకపోకలకు అంతరాయం కలుగకుండా స్థల పరిశీలన చేసి, వాహనాలు లోపలికి ప్రవేశం, బయటికి పోయే మార్గాల పైన చర్చించారు.
క్రీడా మైదానానికి చుట్టు పక్కల ఉన్న ఖాళీ స్థలాలు, డే అండ్ నైట్ వంతెనకు ప్రక్కన ఉన్న కాలువను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆర్ అండ్ బి ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ, డిఈలు, డిఎస్డిఓ మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




