Palakonda: నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్ కమిషనర్ హెచ్చరిక!
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో ప్లాస్టిక్ గ్లాసుల నిషేధం అమలులో భాగంగా కమిషనర్ నూకరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Palakonda: నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్ కమిషనర్ హెచ్చరిక!
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో జ్యూస్ షాపులు, హోటల్స్ లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ లేయర్ ఉన్న పేపర్ గ్లాసులను ఆగస్టు 1వ తేదీ నుండి నిషేదించడమైనదని వర్తకులతో నోటీసుల ద్వారా శ్రీయుత కమిషనర్ వారు తెలియజేసినప్పటికీ ఇంకనూ వినియోగిస్తున్న పలు జ్యూస్ షాపులను ఈరోజు కమిషనర్ శ్రీ నూకరాజు గారు స్టాఫ్ తో కలసి తనిఖీ చేసి ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ లేయర్ ఉన్న పేపర్ గ్లాసులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ప్రత్యామ్నాయంగా మట్టి గ్లాసులు గాని, స్టీల్ గ్లాసులు గానీ, గాజు గ్లాసులు గానీ, ఫైబర్ గ్లాసులు గాని వినియోగించుకోవాలని ఇది వరకే చెప్పడం జరిగిందనీ మొట్టమొదటిసారిగా తనిఖీలో గ్లాసులు మాత్రమే తీసుకోవడం జరిగిందని ఇంకనూ ఇదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ లేయరు ఉన్న పేపర్ గ్లాసులను వినియోగిస్తే అపరాద రుసుము విధించడం జరుగుతుందనీ ఇంకా కొనసాగితే షాపులు సీజ్ చేయడం కూడా జరుగుతుందనీ కమిషనర్ వారు తెలియజేశారు.




