Ichchapuram: ప్రశాంత ఎన్నికలకు అభ్యర్థులంతా సహకరించాలి: పలాస డీఎస్పీ

Ichchapuram: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలకు అభ్యర్థులు సహకరించాలని, గెలుపు సంబరాలు, ర్యాలీలకు అనుమతి లేదని పలాస డీఎస్పీ జి.వి.రమణ స్పష్టం చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 22 Nov 2026 5:18 PM IST
Ichchapuram
X

Ichchapuram: ప్రశాంత ఎన్నికలకు అభ్యర్థులంతా సహకరించాలి: పలాస డీఎస్పీ

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యర్థులంతా పోలీసులకు సహకరించాలని పలాస–కాశీబుగ్గ రేంజ్ డీఎస్పీ జి.వి.రమణ విజ్ఞప్తి చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నిబంధనలు, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రచార సమయం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించిన అనంతరం గ్రామాల్లో సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలతో పాటు అవసరమైన మేరకు అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ రాజకీయ పోటీ సహజమే అయినా, అది గ్రామాల ప్రశాంతతను దెబ్బతీయకూడదని హితవు పలికారు. ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని ఆయన కోరారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram