Palakonda: రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు విక్రాంత్, కళావతి భరోసా

Palakonda: జంపరకోట, సీతంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పరామర్శించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 2 May 2026 3:38 PM IST
Palakonda
X

Palakonda: రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు విక్రాంత్, కళావతి భరోసా

పాలకొండ: పాలకొండ మండలం జంపరకోట సమీపంలో,సీతంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన డోలమడ గ్రామానికి చెందిన అక్కుపల్లి రమణ,జంపరకోట గ్రామానికి చెందిన ఆరిక ఆదిలక్ష్మి,కొండగొర్రి శ్రావణి, ఉర్ల క శాంతి,జీలకర్ర మోహన్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారు,మాజీ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి గారు.మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి,తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని, మేడకోట రోడ్డు కు ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలని కోరారు.మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కి ప్రమాద సంఘటనను తీసుకువెళ్తామని అన్నారు.వీరితో పాటు పరామర్శించిన వారిలో కణపాక సూర్యప్రకాష్, రణస్థలం రాంబాబు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story