Palakonda: వెలగవాడ దళితుల సమస్యలపై సీఐటీయూ పర్యటన
Palakonda: పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో సామాజిక శంఖారావం నిర్వహించారు.
Palakonda: వెలగవాడ దళితుల సమస్యలపై సీఐటీయూ పర్యటన
Palakonda: దళితుల సమస్యలపై జీవో 1235 అమలు చేయాలని పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో సామాజిక శంఖారావం
కుల వివక్షను రూపుమాపాలని, జస్టిస్ పున్నయ్య కమీషన్ సిపార్సులు అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్ చేశారు.
పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆయన నేతృత్వంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూసి దుర్గారావు, సిఐటియు మండల కార్యదర్శి కాద రాము స్థానికంగా ఎం .నవీను తదితరులు సోమవారం ఉదయం పర్యటించారు. వెలగవాడ దళితులకు స్మశాన స్థలము ఉన్నది .రహదారి సౌకర్యం లేదని, ఎస్సీ వీధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి నివాసమున్నచోట స్థలాలు లేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజిక, పట్టు శాలి తదితర సామాజిక వర్గాలకు చెందిన స్మశాన వాటిక స్థలాన్ని సుమారు 70 సెంట్లు ప్రస్తుతం నాలుగు సెంట్లు మాత్రమే ఉన్నదని మిగిలినది ఆక్రమణకి గురైనదని అన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు పర్యటించి దళితులు తదితర సామాజిక వర్గాల సమస్యలపై అధ్యయనం చేశారు.




