Srikakulam: భక్తి సంగీతం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది!

Srikakulam: శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 17 Nov 2026 11:33 AM IST
Srikakulam
X

Srikakulam: భక్తి సంగీతం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది!

Srikakulam: భక్తి సంగీతం మనిషికి మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని మేయ‌ర్ అభ్య‌ర్థి దానేటి రాధారాణి పేర్కొన్నారు.

స్థానిక బాపూజీ కళామందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన భక్తి సంగీత విభావరి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో శ్రీ వాసవి స్వరార్చన భక్తి సంగీత సింహాద్రి.శ్రీనివాస్ రావు బృందం సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు తమ మధురమైన గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

చిన్న‌నాటి నుంచి త‌న‌కు క‌ళ‌లంటే ఎంతో మ‌క్కువ అని క‌ళాకారులంద‌రనీ ఒకే వేదిక‌పై ఇలా క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. భక్తి సంగీతం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, భగవంతుని నామస్మరణతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని అన్నారు.

కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఘనంగా భక్తి సంగీత విభావరి.. గానామృతంతో భక్తులు పరవశించిపోయారన్నారు. అనంత‌రం దానేటి రాధారాణిని అనంతరం సంగీత బృందాన్ని, అతిథులచే ఙ్ఞాపికలు అందించి, ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అతిథులు పొన్నాడ ర‌వికుమార్‌, డా.జామి. బీమశంకర్, పివి.రమణ, టీ.గజపతి కుమార్, కొమరాపు.చిరంజీవి, ఆత్మీయ అతిథులు, వక్తలు, ప్రముఖులు, సంగీత ప్రియులు, స్థానికులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.