Srikakulam: విద్యార్థుల కోసం సారవకోటలో ఆర్వో వాటర్ ప్లాంట్!

Srikakulam: సారవకోట ఉన్నత పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం తల్లి స్వర్గీయ ఉమావతమ్మ జ్ఞాపకార్థం రూ.1.50 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన టీడీపీ నేత ధర్మాన తేజ్ కుమార్.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 30 Sept 2026 12:01 AM IST
Srikakulam
X

Srikakulam: విద్యార్థుల కోసం సారవకోటలో ఆర్వో వాటర్ ప్లాంట్!

శ్రీకాకుళం: సారవకోట గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహం మరియు సమీకృత బాలుర వసతి గృహల్లో ఉన్న విద్యార్థుల త్రాగునీరు కొరకు సారవకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుద్ధి చేసిన త్రాగునీరు యంత్రం (మినరల్ వాటర్ ప్లాంట్) ను సారవకోట మండల తెలుగుదేశం పార్టీ రథసారథి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బిసి కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ గారు ప్రారంభించారు.

విద్యార్థుల త్రాగునీరు కొరకు తేజ్ కుమార్ గారి తల్లి స్వర్గీయ ధర్మాన ఉమావతమ్మ గారి జ్ఞాపకార్థం సొంత నిధులు సుమారు 1,50,000(లక్ష యాభై వేల రూపాయలు) వెచ్చించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తేజ్ కుమార్ గార్కి పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి మంద లోకనాథం గారు,మండల విద్యాశాఖ అధికారులు మడ్డు వెంకటరమణ గారు,భూలక్ష్మి గారు,సారవకోట మాజీ ఎంపీటీసీ కోన వెంకటేష్ గారు,సారవకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సిబ్బంది,ఉపాధ్యాయేతర సిబ్బంది,సారవకోట గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,సారవకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సిరిపురం అప్పలనాయుడు గారు,మామిడి ఆనందరావు గారు గారు,సడగన రామారావు తదితరులు పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA