Ichchapuram: విధుల్లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్‌తో డిజిటల్ అసిస్టెంట్ మృతి!
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండపం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ రౌత్ మెహర్ విధుల్లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు.
Ichchapuram: విధుల్లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్‌తో డిజిటల్ అసిస్టెంట్ మృతి!
ఇచ్చాపురం: విధుల్లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై డిజిటల్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో విషాదం నింపింది. మండపల్లి పంచాయతీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రౌత్ మెహర్ విధుల్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందారు.
మెహర్ మృతితో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి నిరసనగా ఆందోళన చేపట్టారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగానే మెహర్ ప్రాణాలు కోల్పోయారని ఉద్యోగులు ఆరోపించారు. ప్రొబేషన్ కన్ఫర్మ్ కాకపోవడంతో నెలకు కేవలం రూ.15 వేల వేతనంతో విధులు నిర్వహిస్తున్న మెహర్‌పై ఒకేసారి నాలుగు రకాల పనుల భారం ఉందని ఉద్యోగులు తెలిపారు. సిబ్బందిపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
మెహర్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి మెహర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉండగానే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు.




