Srikakulam: శ్రీకాకుళంలో వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేత!
Srikakulam: శ్రీకాకుళంలో రోటరీ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధ జనాశ్రమానికి డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
Srikakulam: శ్రీకాకుళంలో వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేత!
Srikakulam: “మనల్ని చిన్నతనంలో చేతిపట్టుకుని నడిపించిన పెద్దల చేతిని, వారి వృద్ధాప్యంలో మనం పట్టుకోవాలి” అనే మానవీయ సందేశంతో వృద్ధుల సేవకు డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి తనవంతు చేయూత గా 5 లక్షలు అందించారు. నగరంలోని రోటరీ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న వృద్ధ జనాశ్రమానికి విరాళాన్ని డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “వృద్ధాప్యంలో ఎవరి అండా లేక ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ఏ వృద్ధుడికీ రాకూడదు.
జీవితాంతం కుటుంబం కోసం త్యాగం చేసిన పెద్దలకు చివరి దశలో గౌరవం, ఆప్యాయత, భద్రత కల్పించడం మనందరి బాధ్యత. వృద్ధులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ ఆశ్రమం ఒక భవనం మాత్రమే కాదు... ఎందరో వృద్ధులకు ఒక ఇల్లు, ఒక ఆత్మీయత, ఒక భరోసా” అని అన్నారు.
ఈ మహత్తర సేవా కార్యక్రమం ఒక్కరి బాధ్యత కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరిస్తే, మరెంతో మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. దాతలు, సేవాభిమానులు ముందుకు వచ్చి ఈ ఆశ్రమ నిర్మాణానికి సహకరించాలని” ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు గురుస్వామి గుంటముక్క పాపారావు , దువ్వు సన్యాసి రెడ్డి, సిడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.




