Srikakulam: శ్రీకాకుళం జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్: కేంద్ర మంత్రి రామ్మోహన్
Srikakulam: శ్రీకాకుళం జీజీహెచ్‌లో ₹23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Srikakulam: శ్రీకాకుళం జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్: కేంద్ర మంత్రి రామ్మోహన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బ్లాక్ ను ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. ఈ మేరకు డిల్లీ లోని కార్యాలయం నుండి తన సందేశాన్ని విడుదల చేశారు.
ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే జీజీహెచ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.




