Etcherla: అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన

Etcherla: ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.

P.THAVITINAIDU,  ETCHARLA
Published on: 24 July 2026 4:39 PM IST
Etcherla
X

Etcherla: అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన

ఎచ్చర్ల: గత 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు యువకులు చేపడుతున్న ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ ఎచ్చెర్ల నియోజకవర్గం కేంద్రంలో అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యార్థి లోకం కేంద్రప్రభుత్వ విధానాలపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించటం ఇదే ప్రథమమని, దీనికి ప్రధానమైన కారణం మోడీ నాయకత్వం నుండి బిజెపి ప్రభుత్వం విద్యారంగాన్ని బలహీనపరిచేందుకు చేపడుతున్న చర్యలేనని విమర్శించారు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకేజీ గురై లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని రాజకీయ నాయకుల అండతో కోచింగ్ సెంటర్ల మాఫియా దేశంలో పెచ్చు మీరి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉన్నప్పటికీ దానిని కాలరాసే విధంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తుందని విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి గాయపరచడం అశ్వ వాయువు ప్రయోగించటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.

తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, విద్యార్థులపై నిర్బంధం ఆపాలని ఆందోళనకారులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, నీట్ ప్రవేశ పరీక్ష రద్దు వలన ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నీట్ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టి శాస్త్రీయ విద్య అందించాలని, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా విద్యా విధానం మార్చాలని డిమాండ్ చేశారు ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు

P.THAVITINAIDU,  ETCHARLA

P.THAVITINAIDU, ETCHARLA

Next Story