Srikakulam: శ్రీకాకుళంలో విషాదం.. పొలంలో పాము కాటుకు రైతు బలి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలోని జాడుపేట గ్రామంలో పాము కాటుతో రైతు కర్ణం సింహాచలం మరణించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 12 Jun 2026 11:46 AM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళంలో విషాదం.. పొలంలో పాము కాటుకు రైతు బలి!

శ్రీకాకుళం జిల్లా: ఎల్.ఎన్.పేట మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జాడుపేట గ్రామానికి చెందిన కర్ణం సింహాచలం అనే యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తి పాము కాటుకు గురై అకాల మరణం చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కుటుంబ సభ్యులు మరియు భార్య భారతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ వ్యవసాయ పనుల్లో భాగంగా సింహాచలం ఉదయాన్నే తన పొలానికి వెళ్లగా అక్కడ అనుకోని విధంగా విషసర్పం ఆయనపై కాటు వేసింది.

ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను గమనించిన తోటి రైతులు మరియు కుటుంబ సభ్యులు కలిసి ప్రాథమిక చికిత్స నిమిత్తం ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలోని లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

అక్కడ అత్యవసర విభాగంలో చేరిన సింహాచలానికి వైద్యులు శరవేగంగా వైద్య సేవలు అందించినప్పటికీ శరీరంలోకి విషం పూర్తిగా పాకడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. మృతునికి భార్య భారతమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారని వారు ప్రస్తుతం కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎల్లప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండే సింహాచలం హఠాన్మరణంతో జాడుపేట గ్రామం మొత్తం ఒకేసారి మూగబోయింది మరియు ఆయా కుటుంబంలో తీరని శోకం మిగిలింది ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం అందుకుని ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story