Palakonda: నాగావళి నది ప్రవాహంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది!

Palakonda: పాలకొండ మండలం గొట్టమంగళాపురం వద్ద నాగావళి నది ప్రవాహంలో చిక్కుకున్న మహిళను సమయస్ఫూర్తితో కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. అభినందించిన అధికారులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Sept 2026 9:12 AM IST
Palakonda
X

Palakonda: నాగావళి నది ప్రవాహంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది!

Palakonda: నాగావళి నది నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ మహిళను పాలకొండ అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం ప్రకారం పాలకొండ మండలం, గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన మడపల చంద్రమ్మ భర్త: మడపల రాము నాగావళి నది నీటి ప్రవాహం పెరగడంతో గోపాలపురం ఒడ్డు సమీపంలో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పాలకొండ అగ్నిమాపక అధికారి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదీ ప్రవాహాన్ని దాటుకుని చంద్రమ్మను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్యవసర సమయంలో అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన స్పందించి సహాయక చర్యలు చేపట్టి, మహిళ ప్రాణాలను కాపాడారని పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం తెలిపారు.

సిబ్బంది ప్రదర్శించిన సమయస్ఫూర్తిని, ధైర్యసాహసాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాగావళి నదీ తీర ప్రాంత ప్రజలు ప్రవాహాలు ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA