Lamburu Gedda: లంబూరులో ముంపు కాలనీ: ట్రాక్టర్‌పై సబ్ కలెక్టర్ పర్యటన

Lamburu Gedda: లంబూరు గెడ్డ ఉద్ధృతితో నీట మునిగిన ఎస్సీ కాలనీలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఐఏఎస్ ట్రాక్టర్‌పై స్వయంగా పర్యటించి సహాయక చర్యలను సమీక్షించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Sept 2026 6:46 PM IST
Lamburu Gedda
X

Lamburu Gedda: లంబూరులో ముంపు కాలనీ: ట్రాక్టర్‌పై సబ్ కలెక్టర్ పర్యటన

: లంబూరు గెడ్డలో నీటి ప్రవాహం పెరగడంతో నీటిలో మునిగిన లంబూరు ఎస్సీ కాలనీలోకి ట్రాక్టర్ పై వెళ్ళి అన్ని వీధులను సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, IAS పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితులపై వివరాలను సేకరించారు. అలాగే కాలనీ వాసులకు భోజన ఏర్పాట్లు, తాగునీరు తదితర అవసరాలపై ఆరా తీశారు.

ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ గారు సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA