Srikakulam: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. అటవీ శాఖ!

Srikakulam: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎంఎస్ పల్లి జెడ్పీ హైస్కూల్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 'ఏక్ పేడ్ మా కే నామ్' మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 14 Aug 2026 7:57 PM IST
Srikakulam
X

Srikakulam: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. అటవీ శాఖ!

శ్రీకాకుళం: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎంఎస్ పల్లి జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి పి. అమ్మన్నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మందస అటవీ ఉప పరిధి అధికారి టి. దేవరాజు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరు మీద) కార్యక్రమంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతో పాటు పచ్చదనం ప్రాధాన్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కిషోర్ కదంగా, జిల్లా ఈకో క్లబ్ అధికారి ప్రమోద్ కుమార్ పాడి, అటవీ శాఖ సిబ్బంది, బీట్ అధికారులు భానుమూర్తి, సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story